అఖండ సీక్వెల్ ఫిక్స్

బాలకృష్ణ – బోయపాటి కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈరోజు బుధువారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పటు చేసారు. ఈ కార్య క్రమంలో బోయపాటి..అఖండ కు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘అఖండ’లోనే సీక్వెల్ కు సంబంధించి లీడ్ వదిలాము అని అన్నారు. కానీ ఎప్పుడు ? ఎక్కడ? ఎలా అనేది మాత్రం సస్పెన్స్.

ఆ విషయాన్నీ తరువాత వేరే స్టేజిపై వెల్లడిస్తాము అని సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం బాలయ్య..క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కబోతుంది.