Site icon TeluguMirchi.com

విరాట్ కోహ్లీ గా నటించాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టిన అఖిల్

అక్కినేని అఖిల్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకి క్రీడల నేపథ్యంలోని సినిమాల్లో నటించాలని ఉందని, ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, అలాంటి బయోపిక్స్ లో నటించడానికి తాను రెడీ అని తెలిపారు అఖిల్. అదేసమయంలో విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే అందులో హీరోగా నటించడానికి తాను రెడీ అని తెలిపారు. విరాట్ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతందని అన్నారు. మరి అఖిల్ కోరిక ను ఎవరు తీరుస్తారో చూడాలి. ప్రస్తుతం రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని బన్నీ వాసు నిర్మించారు.

Exit mobile version