ముద్దుల్లో మునిగిన పూజా- అఖిల్

అఖిల్ – పూజా హగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ . ఈ మూవీ ఫై అఖిల్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుండగా..తాజాగా అక్టోబర్ 08 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్ ను స్పీడ్ పెంచారు.

తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘లెహరాయి’ ప్రోమోని విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రోమోలో హీరోయిన్ పూజా హెగ్డేతో అఖిల్ ఫూల్ రొమాన్స్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతుంది.