సీత పనియిపోయింది ..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్..రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తన పాత్ర తాలూకా షూట్ ను పూర్తి చేసింది అలియా.

మూడు రోజుల క్రితం ముంబయి నుండి ఆలియా భట్ హైదరాబాద్ కు ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చిన విషయం తెల్సిందే. ఇద్దరు హీరోలు ఇంకా కీలక నటీనటులు ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ లో పాల్గొన్నారు. ఆలియా భట్ ప్రమోషనల్ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుందట. ఆలియా భట్ మరియు హీరో పై జరిపిన షూట్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంతే కాకుండా ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన మొత్తం వర్క్ ను కంప్లీట్ చేసింది. హైదరాబాద్ ను వీడిన సీత అలియాస్ ఆలియా భట్ మళ్లీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది.