Site icon TeluguMirchi.com

అల్లు అరవింద్ మరో రంగంలోకి..?

మెగా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు ఉన్న అల్లు అరవింద్..రీసెంట్ గా తన అస్తిపంపకాలను తన ముగ్గురి కొడుకులకు సమానంగా పంచినట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. తన బ్యానర్..బిజినెస్ సైతం తన పెద్ద కొడుకు ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం రామాయణం అనే సినిమా చేసి సినిమాలు దూరం కావాలని అనుకున్నట్లు అంత అనుకున్నారు కానీ తాజాగా ఆయన మరో వ్యాపారంలోకి దిగాలని ఆలోచనలో ఉన్నాడట.

అమేజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ తరహాలో ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ను ఆయన మొదలుపెట్టబోతున్నాడట. మరీ వాటి స్థాయిలో కాదు కానీ.. టాలీవుడ్ రేంజికి తగ్గట్లు ఓ మోస్తరు స్థాయిలోనే ఈ ప్రాజెక్టును అరవింద్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. మరి ఇది నిజమా కదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version