Site icon TeluguMirchi.com

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కొత్త రికార్డు, రికార్డు స్థాయిలో ఫాలోయర్స్…

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version