Site icon TeluguMirchi.com

బన్నీ నెక్స్ట్ ఎవరితోనో..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటించగా..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ ఎవరి డైరెక్షన్లో చేస్తాడనేది ఆసక్తి గా మారింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్‘ సినిమాను చేస్తారని టాక్ వినిపిస్తొంది. అంతేకాదు.. లిస్ట్‌లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, పరశురామ్, రాధాకృష్ణ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి. మరి వీరిలో ఎవరికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారో చూడాలి.

Exit mobile version