శ్రీదేవి ఈమెనేనట..

‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరిగా నానితో కలిసి ‘వి’ అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. . పలాస సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ లో ‘ఈ రోజుల్లో’ ‘బస్ స్టాప్’వంటి సినిమాలతో అలరించిన ఆనంది నటిస్తుంది. తాజాగా విడుదల చేసిన వీడియోలో లైటింగ్ సూరిబాబు శ్రీదేవికి సైట్ కొట్టడాన్ని చూపించారు. సుధీర్ బాబు సోడా తాగుతుంటే ‘గోలీ గొంతులోకి దిగుద్ది జాగ్రత్త’ అనీ… ఆతర్వాత ‘నీలాగే ఒకడు సోడా సోడా అని తిరిగితే సోడా తీసి వాడి నెత్తి మీద కొట్టా.. అప్పటి నుంచి అందరూ నన్ను సోడాల శ్రీదేవి అంటున్నారు’అంటూ సుధీర్ బాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు చూపించారు.