Site icon TeluguMirchi.com

అనసూయకు ఆ చెడ్డ అలవాటు ఉందట..ఆ టైంలో అలాగే చేస్తుందట..

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మిలియన్ల ఫాలోయర్స్ తో ఆకట్టుకుంటుంది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకునే ఈ భామ..తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. పార్టీలకు ఆమె ఎలా సిద్ధమవుతారో ఈ వీడియో ద్వారా తెలుపుతూ..తనకు ఉన్న చెడ్డ అలవాటు ను అందుకో చెప్పుకొచ్చింది .

తన ముఖంపై చాలా మచ్చలు ఉంటాయని, దగ్గరగా వచ్చి చూస్తే కనిపిస్తాయని అనసూయ అన్నారు. తన మేనత్తలకు, నానమ్మకు ఇలానే ఉండేవని చెప్పారు. తన చిన్న చెల్లికి అయితే మరీ భయంకరంగా ఉంటాయని అన్నారు. దీనికి తోడు తన ముఖంపై ఎప్పుడైనా మొటిమ వస్తే గిచ్చేసుకుంటానని తెలిపారు. ముఖంపై ఉన్న మచ్చలన్నీ అవేనని అన్నారు. ఇది తనకున్న చెత్త అలవాటని అనసూయ వెల్లడించారు. కాకపోతే, తాను బీభత్సంగా ఆలోచిస్తూ గిచ్చేసుకుంటూ ఉంటానని.. తనకు తెలియకుండానే జరిగిపోతుందని అన్నారు.

Exit mobile version