పెద్ద హీరోలను లైన్ లో పెడుతున్న అనిల్ రావిపూడి

వరుస విజయాలను అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో ఎప్పటినుండో డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబో లో సినిమా ఉండనుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతున్నట్లు కనిపిస్తోంది, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రం చేస్తున్నాడు. అఖండ చిత్రం షూటింగ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడట, హీరో రామ్ తో కూడా మరో సినిమా చేయనున్నట్లు ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.