‘అన్నాత్తే’ థియేట్రికల్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారో తెలుసా..?

సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూ.12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పంపిణీ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ నైజాంలో విడుదల చేస్తుంది.

ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేశ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు మీనా, కుష్బూ తదీతరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.