Site icon TeluguMirchi.com

అక్కినేని కొత్త సీన్లు !

Nag-Retirement
అక్కినేని నాగేశ్వరరావు వెళ్లిపోతూ తమ కుటుంబానికి ఎన్నటికీ మర్చిపోలేని కానుక ఇచ్చివెళ్లారని ఆయన తనయుడు, హీరో అక్కినేని నాగార్జున అన్నారు. మనం చిత్రం విజయానందంలో ఉన్న ఆయన ఆ విజయాన్ని తమ కుటుంబం పూర్తిగా ఆస్వాదించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్లిష్టమైన కథ, కథనాలతో కూడిన మనం చిత్రం తమ కుటుంబానికి తప్ప మరెవరికీ సాధ్యపడదని, సినీ పరిశ్రమతో పాటు విదేశాల్లోని అక్కినేని అభిమానుల నుంచి వస్తున్న స్పందన కళ్లు చెమ్మగిల్లేలా చేసిందన్నారు. మనం 50వ రోజు అక్కినేని నటించిన మరిన్ని దృశ్యాలను చిత్రానికి జోడిస్తున్నట్లు చెప్పారు నాగార్జున.

Exit mobile version