ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న సుందరం


నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. జూన్ 10 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. చాలా కాలంగా నాని నుంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా కోరుకున్న ప్రేక్షకులకి సుందరం అందించిన ఆరోగ్యకరమైన హాస్యం నచ్చినా, ఎందుకో అసలు నాని సినిమా అంటే రావాల్సిన స్థాయిలో థియేటర్ల వద్ద ప్రేక్షకుల కనిపించలేదు. అయితే జూలై 10న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం,మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్ లో విడుదల అయింది. థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. తెలుగు వెర్షన్ లో మొదటి స్థానంలో, తమిళ వెర్షన్ లో ఆరో స్థానంలో నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుందిట. ఈ వార్త ఖచ్చితంగా నానికి మరియు చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తుంది అనే చెప్పాలి.