సినిమా టికెట్ కొత్త ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్

ఏపీ సర్కార్ సినిమా టికెట్ కొత్త ధరలు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది.

కొత్త టికెట్ ధరలు చూస్తే..

మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్: రూ.150, ఎకానమీ: రూ.75
ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీలు:

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5