ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘అరవింద సమేత’. దసరా కానుకగా అక్టోబర్ 11 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఆడియో , ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెపుతుంది. మొదటిసారి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో లో సినిమా వస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే చిత్ర బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు. కేవలం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కుల రూపంలో 93 కోట్ల మేర బిజినెస్ చేసిందట.
ఇక ఏరియా వైజ్ చూస్తే..
ఏరియా | ప్రీ రిలీజ్ బిజినెస్ |
---|---|
నైజాం | 19.50 కోట్లు |
సీడెడ్ | 15కోట్లు |
కృష్ణ | 5.50కోట్లు(అడ్వాన్ష్) |
గుంటూరు | 7.5కోట్లు |
ప.గో జిల్లా | 4.90 కోట్లు |
నెల్లూరు | 3.30 కోట్లు |
ఏపీ-తెలంగాణ | 71కోట్లు |
కర్నాటక-తమిళనాడు-ఉత్తర భారతదేశం | 9.50కోట్లు |
ఓవర్సీస్ | 12.50 కోట్లు |
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ | 93 కోట్లు |