తొలి అనుభవం అద్భుతంగా ఉందంటున్న అవికా గౌర్

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ఎంతో పాపులర్ అయినా అవికా గౌర్..ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయి మొదటి చిత్రం తోనే సూపర్ హిట్ ను చవిచూసింది.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘రాజుగారి గది 3’ వంటి చిత్రాలలో నటించి బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి అవికా.. ‘ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం. మొత్తం లొకేషన్‌లో వైబ్ చాలా విభిన్నంగా ఉంది’..అని తెలిపింది. కాగా ఆమే ప్రస్తుతం నాగ చైతన్య, రాశిఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ సినిమాతో పాటు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ మూవీలోనూ నటిస్తోంది.