అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ పాత్ర ఇదే…

పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతుంది. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడగా… తాజాగా ఈ రోజు చిత్ర యూనిట్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో భీంలా నాయక్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఉన్న వెనుకనుండి ఫోటో తీసి సోషల్ మీడియాలో వదలగా కొద్దిసేపటలోనే ట్రెండ్ అయింది.