బాలయ్య షో మూడో గెస్టులు ఎవరో తెలిస్తే నవ్వులే నవ్వులు

వెండితెర ఫై తన డైలాగ్స్ అదరగొట్టిన నందమూరి బాలయ్య..ఇప్పుడు ఆహా కోసం హోస్ట్ గా మారాడు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా బాలకృష్ణ తో ”అన్ స్టాపబుల్ విత్ NBK” షో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షో కు పలువురు నటులు హాజరై ఆకట్టుకోగా..ఇక ఇప్పుడు ఈ షో కు నవ్వుల రాజు బ్రహ్మానందం, హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి హాజరుకానున్నట్టు ఆహా ప్ర‌క‌టించింది గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా జాతిరత్నాలు సినిమాలో కనిపించి నవ్వించారు. త్వరలోనే పంచతంత్ర, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అఖండ షూటింగ్ స‌మ‌యంలో అయిన గాయం వ‌ల‌న బాల‌య్య కొద్ది రోజులుగా షోకి దూరంగా ఉన్నారు. డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో బాలయ్య ‘ఆహా’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇక రీసెంట్‌గా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బాలయ్య చేతికి కట్టుతో హాజరయ్యారు. ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ షోకి సంబంధించిన తాజా ప్రోమోలోను చేతి క‌ట్టుతోనే క‌నిపించారు.

Comedy KING #Brahmanandam and FUNtastic Director @AnilRavipudi are on our sets this week to tickle your bones! 😄😄#UnstoppableWithNBK episode 3 premieres Dec 3.
#NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd pic.twitter.com/ndKSmKgg2l— ahavideoIN (@ahavideoIN) December 1, 2021