డల్లాస్ లో బాలయ్య ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు

నందమూరి బాలకృష్ణ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లోను విపరీతమైన అభిమానులు ఉన్నారు. బాలయ్య నుండి కొత్త సినిమా వస్తుందంటే వారి సంబరాలు అంబరాలు తాకాల్సిందే. తాజాగా అఖండ రిలీజ్ సందర్బంగా వారంతా సంబరాలు చేసుకున్నారు. ఈరోజు విడుదలైన అఖండ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం తో వారి సంతోషం మాములుగా లేదు.

సోషల్ మీడియాలో మొత్తం నందమూరి అభిమానుల హడావిడే నడుస్తోంది. తాజాగా ట్విట్టర్ లో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో డల్లాస్ లో ‘అఖండ’ మాస్ జాతర జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. ఇక్కడ సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే విదేశాల్లో ప్రీమియర్ అవుతుందన్న విషయం తెలిసిందే. అలా సినిమాను వీక్షించిన డల్లాస్ నందమూరి అభిమానులు అక్కడ తమ అభిమానాన్ని వ్యక్త పరుస్తూ ఏకంగా కార్ ర్యాలీనే నిర్వహించడం విశేషం.

Dallas Car Rally 🦁🔥#Akhanda #AkhandaMassJathara pic.twitter.com/JIEmeIrHV3— Nandamurifans.com 🦁🐯 (@Nandamurifans) December 2, 2021