బంగార్రాజు 5 డేస్ కలెక్షన్స్

కింగ్ నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ బంగార్రాజు. త‌న కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయ‌న మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఐదు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 7.45 కోట్లు
సీడెడ్‌లో రూ. 5.65 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 4.01 కోట్లు
ఈస్ట్‌లో రూ. 3.29 కోట్లు
వెస్ట్‌లో రూ. 2.41 కోట్లు
గుంటూరులో రూ. 2.91 కోట్లు
కృష్ణాలో రూ. 1.88 కోట్లు
నెల్లూరులో రూ. 1.46 కోట్లతో.. 5 రోజుల్లో రూ. 29.06 కోట్లు షేర్, రూ. 46.90 కోట్లు గ్రాస్ వచ్చింది.