Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ హర్రర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తుండగా, అర్చన సమర్పిస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం కథనంతో పాటు, హర్రర్, మిస్టరీ అంశాలతో కూడిన ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది.
ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. హాంటెడ్ హౌస్ లోకి అడుగుపెడుతున్న హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా ప్రారంభమయ్యే కథలో “కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు” అనే డైలాగ్‌తో టీజర్ మిస్టరీ వాతావరణాన్ని సృష్టించింది. చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన “అహం మృత్యువు” అనే డైలాగ్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్‌ను కలిగించింది. ఇతిహాస, ఆధ్యాత్మికత, హర్రర్ అంశాల మేళవింపుగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం బెల్లంకొండ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశముందని అంచనాలు ఉన్నాయి.