భీమ్లా నాయక్ సంక్రాంతి పోస్టర్ ..

భీమ్లా నాయక్ నుండి సంక్రాంతి కానుకగా సరికొత్త పోస్టర్ వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ మాస్ మల్టీస్టారర్ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ వచ్చి విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భీమ్లా నాయక్, డానియేల్ శేఖర్ పాత్రల్లో నటిస్తున్న పవన్, రానా కలయితో డిజైన్ చేసిన ఓ పవర్‌ఫుల్ మాస్ పోస్టర్‌ను వదిలి పండుగ శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వాస్తవానికి సంక్రాంతి బరిలో ఈ మూవీ రావాల్సి ఉండగా..కొన్ని కారణాలవల్ల ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది.