భీమ్లా నాయక్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుందని అంటున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకి త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందించగా సాగర్ డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కిది అఫీషియల్ రీమేక్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఈ తరుణంలో చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. డిసెంబర్ 15న చిత్రబృందం ‘భీమ్లా నాయక్’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. త్వరలో దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట.