బిగ్ బాస్ 5 : ఈ వారం శ్వేతా అవుట్ ..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ప్రతి వారం ఇంటినుండి ఒక సభ్యుడు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇప్పటికే 5 గురు సభ్యులు ఎలిమినేట్ అవ్వగా..ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అయితే ఈ వారం షణ్ముఖ్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్లలోకి రాగా, కాజల్, యాని మాస్టర్ వంటి కంటెస్టెంట్లు తప్పించుకున్నారు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం శ్వేత ఎలిమినేట్ కానుంది. నిజానికి హౌజ్ మేట్స్ అందరిలో శ్వేత, విశ్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. కానీ విశ్వ ఈ వీక్ కెప్టెన్ గా మరోసారి ఎన్నిక కావడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. కానీ ప్రస్తుతానికి శ్వేత వర్మకు అతి తక్కువ ఓట్లు ఉన్నాయని, కాబట్టి ఆమె ఈ రోజు ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.