Site icon TeluguMirchi.com

నటుడు బ్రహ్మాజీ వాడుతున్న మెడిసిన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

నటుడు బ్రహ్మాజీ..ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకాయ, మర్యాద రామన్న ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.

ప్రస్తుతం ఉన్న సీనియర్ నటుల్లో ఈయన ఒకరు. తన వయసు మించి వరుస అవకాశాలు దక్కించుకుంటూ రేయి పగలు కష్టపడుతూ యంగ్ హీరోలకు ఆదర్శం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన ఓ మెడిసిన్ వాడుతున్న విషయాన్నీ బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ఒకరు అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. సహ నటుల ట్వీట్స్‌కి సరదాగా రిప్లై ఇస్తూ.. అభిమానులకు కూడా ఎప్పుడూ టచ్ లో ఉంటాడు. తాజాగా ఓ అభిమాని బ్రహ్మాజీని ‘బ్రహ్మాజీగారు మీరు తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారు. మీరు ఏదో మెడిసిన్ వాడుతున్నారనిపిస్తోంది. లేదంటే 20 సంవత్సరాలుగా సేమ్ లుక్‌ని మీరెలా మెయిన్‌టైన్ చేయగలరు?’ అని ప్రశ్నించాడు.

దీనిపై స్పందించిన బ్రహ్మాజీ తాను మెడిసిన్ వాడుతున్న మాట వాస్తవమేనన్నారు. ‘‘నువ్వు చెప్పింది నిజమే. యోగా, మెడిటేషన్, ధ్యానం, 8 గంటల నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, నిబద్ధత, సంతోషంగా ఉండటం, క్రమశిక్షణతో ఉండటం అనే మెడిసిన్స్‌ను నేను 365 రోజులూ తీసుకుంటాను’’ అని బ్రహ్మాజీ తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం బ్రహ్మాజీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.

Exit mobile version