బోయపాటి తో స్టైలిష్ స్టార్ పాన్ మూవీ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకొని ..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఐకాన్ చేయనున్నాడు. దీని తర్వాత కానీ , దీనికంటే ముందు గాని బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ పాన్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘సరైనోడు’ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీను బాలకృష్ణ తో అఖండ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.