రోడ్డు ప‌క్క‌న హోట‌ల్‌లో టిఫిన్ చేసిన బన్నీ..

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కాకినాడ లో ప్లాన్ చేసారు. అయితే రెండు రోజులుగా అక్కడ విపరీతమైన వర్షాలు పడుతుండడం తో షూటింగ్ ను రద్దు చేసారు. ఈ క్రమంలో బన్నీ అక్కడి పరిసరాల్లో చక్కర్లు కొడుతున్నారు. రీసెంట్ గా సిటిమార్ మూవీ చూసిన బన్నీ..గోక‌వ‌రంలో రోడ్డు ప‌క్క‌న హోట‌ల్‌లో టిఫిన్ చేసారు. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. బ‌న్నీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Icon Star #AlluArjun was having breakfast at road side tiffin centre near gokavaram.@alluarjun ❤️ #Pushpa pic.twitter.com/25OCuNGRB4— Allu Arjun Fan™ (@IamVenkateshRam) September 13, 2021