సమంత ను మరచిపోలేకపోతున్న చైతు

నాగ చైతన్య , సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం ఎంతో చక్కగా మెలిగిన వీరిద్దరూ ఇటీవల విడాకులు తీసుకొని అంత షాక్ ఇచ్చారు. ఇద్దరు ఇష్టపూర్తిగా విడిపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు కూడా ఎవరి బిజీ లో వారు ఉన్నారు. అయితే చైతు మాత్రం సామ్ ను మరచిపోలేకపోతున్నాడు. ఇటీవల పలు ఇంటర్వూస్ లలో సామ్ పేరు చెప్పుకొచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నాగచైతన్య మాట్లాడుతూ…ఇప్పుడు ఇదే సరైన నిర్ణయం..ఇద్దరం విడిపోయాం తను హ్యాపీగా ఉంది, నేను హ్యాపీ గా ఉన్నాను అంటూ స్పందించారు. అయితే తాజాగా మరోసారి సమంత పేరు చైతూ నోట వినిపించింది. మీ బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరు అంటూ యాంకర్ ప్రశ్నించగా చైతూ ఆలోచించకుండా సమంత అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక రీసెంట్ గా చైతు ..నాగ్ తో కలిసి బంగార్రాజు మూవీ చేసాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది.