సమంత తో విడాకుల ఫై మరోసారి నోరు విప్పిన చైతు

అక్కినేని నాగ చైతన్య – సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ..ఇద్దరు కలిసి ఉండలేక ఇష్టపూర్తిగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీ గా ఉన్నారు. తాజాగా బంగార్రాజు మూవీ ప్రమోషన్లో సమంత కు విడాకులు ఇవ్వడం ఫై మరోసారి నోరువిప్పారు.

విడాకులతో ఇద్దరం హ్యాపీగా ఉన్నామని.. ఇద్దరి మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఈ సిట్యువేషన్ ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని అన్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.