బిగ్ బాస్ వేదిక ఫై చరణ్ వేసుకున్న జాకెట్ ధ‌ర ఎంతో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా డిస్నీ + హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ వేదిక ఫై దీనిని ప్రకటించారు. డిస్నీ హాట్ స్టార్ తెలుగు వెర్షన్ ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ వేదిక ను పంచుకున్నారు.

ఈ షో కు గాను చరణ్ డెనిమ్ జీన్స్ ధ‌రించి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయ‌న ధ‌రించిన జాకెట్ ధ‌ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫ్యాషన్ బ్రాండ్ డస్ట్ ఆఫ్ గాడ్ తయారు చేసిన జోకన్ డెనిమ్ ధర అక్షరాల 1.3 లక్షలు అట. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు నోరెళ్ల‌పెడుతున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య మూవీ చేస్తున్నారు.