చరణ్ లుక్ ఫై శంకర్ సీరియస్

రామ్ చరణ్ – శంకర్ కలయికలో దిల్ రాజు ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ తాలూకా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. అలాగే ఇక హీరోల లుక్ విషయంలో శంకర్ ఎలివేషన్ మరో లెవల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత్ర డిమాండ్ ని బట్టి విభిన్న కోణాల్లో ప్రోజెక్ట్ చేయడానికి శంకర్ వెనకాడరు. ఇప్పుడు ఈ మూవీ లో చరణ్ పాత్ర కోసం కూడా శంకర్ సీరియస్ వర్క్ చేస్తున్నాడట. చరణ్ పై మాసివ్ గా లుక్ టెస్ట్ చేస్తున్నారని సమాచారం. మునుపెన్నడు చూడని సరికొత్త చరణ్ ని వెండి తెరపై చూస్తామనే ప్రచారం జోరుగా సాగుతోంది.