Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ను మిస్ అవుతున్న అంటూ బాధ పడుతున్న చరణ్…

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం .. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం పట్ల రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి వర్క్ చేయడం అంటే తనకెంతో ఇష్టమంటున్న చరణ్ షూటింగ్లో ఎన్టీఆర్ ఉంటే చాలా సందడిగా ఉంటుందని, ఒకవేళ తారక్ షూటింగ్లో లేకపోతే అతన్ని మిస్సవుతానని అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్, తాను చాలా కాలం నుండి స్నేహితులం కావడం వలన చాలా సులభంగా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Exit mobile version