Site icon TeluguMirchi.com

రామ్ చరణ్ ను చూసి నమ్మలేకపొతున్నారు..అసలు ఏంటి ఈ అవతారం

చిరుత సినిమా లో ఉన్న చరణ్ కు ..ఇప్పటి చరణ్ కు చాల తేడాలు కనిపిస్తున్నాయి. అసలు నిజంగా అప్పటి చరణ్ నేనా మనం చూస్తున్నదని అంత మాట్లాడుకుంటున్నారు. ముఖ్యం గా ఆర్ఆర్ఆర్ కోసం తన బాడీ షేప్ నే మార్చేశాడు.

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ తాలూకా సన్నివేశాలు షూట్ చేస్తుండడం అవి బయటకు లీక్ కావడం జరిగిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా షూటింగ్ కోసం బయల్దేరాడు.

ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో చరణ్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోరమీసాలతో చరణ్ కిరాక్ పుట్టిస్తున్నాడు. భుజానికి బ్యాగ్ వేసుకుని అలా వేగంగా చిరుతలా నడుచుకుంటూ వెళ్తున్న చరణ్ ను చూసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Exit mobile version