శివ శంకర్‌ చికిత్స ఆర్ధిక సాయం అందజేసిన చిరంజీవి

చిత్రసీమ లో ఎవరు ఆపదలో ఉన్న..చిత్రసీమ కు ఏ కష్టం వచ్చిన చేయూత అందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా తో బాధపడుతున్న శివ శంకర్ మాస్టర్ కు ఆర్ధిక సాయం అందజేశారు.

కరోనా బారిన పడిన శివశంకర్‌ మాస్టర్‌ ఏఐజి ఆస్పత్రి క్రిటికల్‌ కేర్‌లో వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నారు. శివ శంకర్‌ మాస్టర్‌ పెద్ద కుమారుడికి కూడా కరోనాతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్‌ మాస్టర్‌ చిన్న కుమారుడు అజయ్‌ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పరిశ్రమ ప్రముఖులను కోరారు. వెంటనే స్పందించిన చిరంజీవి అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇంటికి పిలిపించి మూడు లక్షల రూపాయల చెక్కును అంద.జేశారు. మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మేమంతా అండగా ఉంటామని చిరంజీవి మాటిచ్చారు.