నయన్ ను కోరుకుంటున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాతో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కనుంది. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ని జోడించారు. ప్రస్తుతం ఈ చిత్రం కాస్టింగ్ జరుగుతోంది. ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. అయితే ఇందులో చిరంజీవి సరసన లేడీ సూపర్ నయనతార అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. చిరంజీవి కూడా నయనతార హీరోయిన్ గా నటించాలని అనుకుంటున్నారట.