సినిమా థియేటర్లలోని ఆక్యుపెన్సీని 50% కి తగ్గించిన ఏపీ

సినిమా థియేటర్లలోని ఆక్యుపెన్సీని 50 % తక్షణమే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పంపిణీదారులు / ఎగ్జిబిటర్లు మరియు ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న గొడవ కారణంగా ఏపీ లోని చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఇప్పటికే అనేక ఇతర రాష్ట్రాలు థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గించగా, మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ కూడా ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లలో 50% ఆక్యుపెన్సీని అమలు చేయాలని ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాల్స్ లో 6 అడుగుల భౌతిక దూరాన్ని నిర్వహించాలి.

తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. దీంతో థియేటర్స్ లో సెకండ్ షోస్ రద్దు అవుతాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇప్పటికే అనేక సినిమా షూట్లను రద్దు చేయవలసి వచ్చింది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన పలు సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి.