కరోనా బారినపడిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్‌ లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా వచ్చిందన్నారు.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో వెల్లడించిన లోకేష్.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజలే కాకుండా సినీ , రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కొన్ని క్షణాల ముందే లేఖ రాశారు నారా లోకేష్‌.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని గుర్తుచేసిన ఆయన.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.