హిందీ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్..?

పుష్ప మూవీ తో మ్యూజికల్ హిట్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్..అతి త్వరలో హిందీ మూవీ కి మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం.టీసీరీస్ అధినేత భూషణ్ కుమార్ దేవీశ్రీ ప్రసాద్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేయడమే దీనికి కారణం. గతంలో హిందీ డబ్బింగ్ సినిమాలతో దేవీశ్రీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు కానీ.. స్ట్రైట్ హిందీ మూవీస్ కు మాత్రం ఆయన ఇంతవరకూ సంగీతం అందించలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని సమాచారం.

ఇటీవల దేవీ, భూషణ్ కుమార్‌ను కలుసుకోవడం విశేషంగా మారింది. టీసిరీస్ సంస్థ నిర్మించనున్న ఓ భారీ చిత్రానికి దేవీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.