కరోనా కు చిక్కిన ఖిలాడీ బ్యూటీ

కరోనా మహమ్మారి మరోసారి చిత్రసీమను వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల పలువురు సినీ ప్రముఖులు కన్నుమూయగా..చాలామంది కరోనా బారినపడ్డారు. తాజాగా ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయాతి కరోనా బారినపడింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆ భామనే తెలిపింది. పూర్తిగా టీకాలు వేసుకున్న ఈ బ్యూటీ తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. తనకు కరోనా అని తెలిసిన వెంటనే ఇంట్లో తనను తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నానని.. చెప్పిన ఈమె.. తన అభిమానులు, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని, చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని అభ్యర్థించింది.

2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది డింపుల్ హయాతి. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయేసరికి అమ్మడు నిరాశకు గురయింది. ఇక ఆ సినిమా తర్వాత యురేకా సినిమాలో ఓ క్యారెక్టర్ ప్లే చేసింది. ఆ సినిమా కూడా ఆశించిన పేరు తీసుకురాలేదు. హరీష్ శంకర్ రూపొందించిన గద్దలకొండ గణేష్ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. సూపర్ హిట్టు నీ హైట్.. సూపర్ హిట్టు నీ రూట్.. అంటూ అమ్మడి అందాలను కూడా ఆరబోసి ఆకట్టుకుంది. ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడీ మూవీ లో నటిస్తుంది. దీనిపై భారీ ఆశలే పెట్టుకుంది.