విజయ్ దేవరకొండ – సుకుమార్ మూవీ పక్కా !

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్న విజయ్ ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే కొద్దీ రోజులుగా ఈ సినిమా కాన్సల్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఓ క్లారిటీ వచ్చింది.

విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ చేయబోయే సినిమా తొందరలోనే ఉంటుందని నిర్మాణ సంస్త ఫాల్కన్‌ స్పష్టం చేసింది. మూవీకి సంబంధించి ఎలాంటి రూమర్లు నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ , విజయ్ దేవరకొండ ముందు ఒప్పుకున్న సినిమాలతో బిజీ గా ఉన్నారని, అవి అయిపోయిన వెంటనే ఈ చిత్రం మొదలవుతుందని స్పష్టం చేసారు.