వరంగల్ లో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం

బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. మొదటిషో తోనే హిట్ టాక్ రావడం తో అభిమానులు, సినీ ప్రేక్షకులు సినిమాను చూసేందుకు పరుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటె వరంగల్ లో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

వరంగల్ లోని జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గమనించిన ప్రేక్షకులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. కొద్దీ క్షణాల్లోనే థియేటర్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. థియేటర్ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.