గని ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

గద్దల కొండ గణేష్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి-వరుణ్‌తేజ్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి గని అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 18 న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటె ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.