పవన్ మూవీ రైట్స్ దక్కించుకున్న టిప్స్ మ్యూజిక్

ప్రముఖ మ్యూజిక్ సంస్థ టిప్స్..పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో రైట్స్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ ఆడియో రైట్స్ ను టిప్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తో పాటు సమంత నటిస్తున్న శాకుంతలం మూవీ ఆడియో రైట్స్ ను దక్కించుకుంది.

ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. హరిహర వీరమల్లు విషయానికి వస్తే.. పీరియాడికల్ యాక్షన్- అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీల పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.