Site icon TeluguMirchi.com

మరో ‘అందాల కిరీటం’

Emily Shah crowned Miss New Jersey USA1అందాల ప్రపంచం లో భారత్ హవా కొనసాగుతోంది. భారతీయ సంతతికి చెందిన అమ్మాయిలు వరుసగా అందాల పోటీల్లో విజేతలుగా మెరుస్తున్నారు. మిస్ అమెరికాగా ఎంపికైన నీనా దావులూరి బాటలో భారత సంతతి చెందిన 18 ఏళ్ళ ఎమిలీ షా 2014 సంవత్సరానికి గానూ మిస్ న్యూజెర్సీ పోటీలో విజేతగా నిలిచి అందరి దృష్టిని తనవైపే తిప్పుకుంది.

130 మంది సుందరాంగులు పోటీపడ్డా కాంపిటేషన్ లో ఎమిలీ కిరీటాన్ని దక్కించుకుని 2014 సీజన్ కు గానూ జరిగే మిస్ అమెరికా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఎమిలీ షా ఇప్పటికే హాలీవుడ్(‘ది గ్రేట్ న్యూ వండర్ ఫుల్’ ) బాలీవుడ్ (ఔట్ ఆఫ్ కంట్రోల్, తా రా రం పం, జానేమన్) సినిమాల్లో సందడి చేసింది.

Exit mobile version