జయమ్మ నుండి సూర్యకాంతం సాంగ్ విడుదల

బుల్లితెర సూపర్ స్టార్ సుమ కనకాల మళ్లీ వెండి తెరకు రీ ఎంట్రీ ఇస్తుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తెలుగు లో నటిగా పరిచయం అయ్యి మెల్లగా యాంకర్ గా కెరీర్ ను ఆరంభించి..ఇప్పుడు లేడి యాంకర్లలో టాప్ స్థానంలో సుమ ఉంది. పెద్ద సినిమాల ఫంక్షన్ అంటే సుమ తప్ప మరొకరు హోస్ట్ గా చేయలేరు అనేంతగా సుమ పేరు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో సినిమాల్లో నటించిన సుమ ఆ తర్వాత మెల్లగా మెల్లగా తగ్గిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ వెండితెరకు రీ ఎంట్రీ కి సిద్ధమైంది. విజయ్‌ కుమార్‌ కాలివరపు దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంలో సుమ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకోగా..ఈరోజు ఆదివారం సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ‘జయమ్మ.. చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయక పల్లె పడుచుల సుమ కనిపించింది.

ఒకపక్క వడ్డీ వ్యాపారం చేసే ఆమె వడ్డీ కట్టకపోతే వస్తువులను తీసుకెళ్లి మరి డబ్బులు వసూలు చేయడం చూపించారు.. అంతలోనే పసిబిడ్డను ఎత్తుకొని అన్నం తినిపించి తన కొంగుతో మూతి తుడవడం చూపించి.. సుమ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కీరవాణి ఈ సినిమాకు సంగీతంఅందించారు. ఇక సింగర్ శ్రీ కృష్ణ ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్ గా ఆలపించి హైప్ తెచ్చాడు.