మరోవిషాదం..సీనియర్ నటి జయంతి కన్నుమూత

చిత్రసీమ మరో సీనియర్ నటిని కోల్పోయింది. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. ఆమె వయసు 76 ఏళ్లు. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. ”స్వాతికిరణం, శాంతి నివాసం, శ్రీదత్త దర్శనం, జస్టిస్‌ చౌదరి, రాజా విక్రమార్క, కొదమ సింహం, దొంగమొగుడు, కొండవీటి సింహం, అల్లూరి సీతారామరాజు, శ్రీరామాంజనేయ యుద్ధం, శారద, దేవదాసు” వంటి అనేక చిత్రాల్లో జయంతి నటించారు.