Site icon TeluguMirchi.com

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జయసుధ …


చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జయసుధ ఆ తర్వాత స్టార్ హీరోల స‌ర‌స‌న ఎన్నో చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో పలు చిత్రాలు చేసిన ఈమె తాజాగా వారసుడు చిత్రంలో హీరో విజయ్ కి తల్లి పాత్రలో నటించింది. కొన్ని రోజులుగా ఈమె వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. అలీ కూతురు ఫంక్షన్ లో, వారీసు వేడుకలో జయసుధ ఒక వ్యక్తితో కలిసి వాటికి హాజరయ్యింది. ఇది చూసిన నెటిజన్లు జయసుధ ఇంకో పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు ప్రచారం చేసారు. తాజాగా ఈ విషయంపై జయసుధ క్లారిటీ ఇస్తూ అతను నా స్నేహితుడు. అమెరికా నుండి వచ్చాడు. నా బయోపిక్ తీసేందుకు అన్ని దగ్గరుండి గమనిస్తున్నాడు అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.

Exit mobile version