జాన్ అబ్రహాం ‘అటాక్’ వచ్చేస్తుంది

జాన్ అబ్రహాం, జాక్విలిన్ ఫెర్నాండెజ్ జంటగా రాజ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అటాక్’. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 13న రిలీజ్ కాబోతోంది. జాన్ అబ్రహాం ఇందులో కమాండోగా కనిపించనున్నాడు. ఓ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన కథాంశంతో.. దేశభక్తి ప్రధానంగా రూపొందిన సినిమా కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.