బింబిసార టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

కళ్యాణ్ రామ్ , కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ జంటగా వాషిట్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ బింబిసారా టైమ్​ ట్రావెల్​ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన ఈ మూవీ లో కల్యాణ్​రామ్​.. పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్​రామ్​ స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు.

ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న సినిమా టీజర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.