కార్తికేయ 2 ట్రైలర్ అప్డేట్

నిఖిల్ , అనుపమ జంటగా చందు డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2 , కార్తికేయ చిత్రానికి కొనసాగింపు గా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆగస్టు 06 న చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంను హంగామాగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఆయన కథ విషయంలో చాలా వర్కౌట్ చేశారు. ఎన్నో రీసెర్చ్ లు కూడా నిర్వహించారని సమాచారం. కార్తికేయ 2 సినిమా ఒక సింపుల్ థ్రిల్లర్ సినిమా కాదని.. ఇది ఒక అద్భుతం అన్నట్లుగా ఉంటుందని మేకర్స్ మరియు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.